ఏవో వాసుదేవరెడ్డి
ఏవో వాసుదేవరెడ్డి
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక రైతు వేదికలో ఆత్మ పథకం ఆధ్వర్యంలో గురువారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి పెద్ది వాసుదేవరెడ్డి మాట్లాడుతూ..ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున,రైతులు ప్రస్తుత వరి,పత్తి పంటల్లో తగిన యాజమాన్య చర్యలు చేపట్టడంతో పాటు ముందస్తు వేసంగిలో పెసర,మినుము,మొక్కజొన్న సాగుపై దృష్టి సారించాలని సూచించారు.జిల్లా ఉద్యాన అధికారి తిరుపతి మాట్లాడుతూ.. నీటి లభ్యతను బట్టి ఉద్యాన,కూరగాయ పంటలతో పాటు ప్రభుత్వ సబ్సిడీలను సద్వినియోగం చేసుకుంటూ ఆయిల్‌పామ్ సాగు చేపడితే అధిక లాభాలు పొందవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో ఆత్మ బీటీటీ సభ్యుడు నడిపెల్లి సంజీవరావు,ఏఈవో నాగరాజు,ప్రకృతి వ్యవసాయ రైతు జంగిలి కృష్ణమూర్తి,రేపాక,రేపాకపల్లి గ్రామాల రైతులు పాల్గొన్నారు
