త్రివేణి పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారుత్రివేణి పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు

శేరిలింగంపల్లి, అక్టోబర్9( తెలుగు గళం )న్యూస్ :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్ల ఫ్లైఓవర్ పక్కన ఉన్న త్రివేణి పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు అందంగా సాంప్రదాయ దుస్తులతో పాల్గొని రకరకాల పూలతో బతుకమ్మను కలర్ ఫుల్ గా పేర్చి పాఠశాల ఆవరణలో బతుకమ్మను ఆడి పాడి అలరించారు ఈ సందర్భంగా త్రివేణి పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిని పెంపొందిస్తుందని స్త్రీ తత్వాన్ని ప్రకృతిని కలిపి ఉండటాన్ని గౌరవించే విధానం తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవడం నేర్పుతుందని అన్నారు బతుకమ్మ ఆటపాటలతో త్రివేణి పాఠశాల సందడిగా మారిందని ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండుగను నిర్వహించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏసీ ఆర్వో నరేష్ ప్రిన్సిపాల్ అనితారావు శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *