గిరిజన బిడ్డకు చేయూత సివిల్స్ అభ్యర్థికి ల్యాప్‌టాప్ అందజేత
పర్వతగిరి మండలం గోరు గుట్ట తండాకు చెందిన బానోత్ చిరంజీవి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న సందర్భంగా రాష్ట్ర ఖాదీ, చిన్న పరిశ్రమల శాఖ పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ల్యాప్‌టాప్ అందజేశారు.ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ, చదువు జీవన విధానాన్ని మారుస్తుందని, చదువు కుటుంబానికి గౌరవం ఇస్తుందని, చదివే సమాజంలో గౌరవాన్ని ఇస్తుందని అన్నారు. గిరిజన బిడ్డలు జీవన ప్రమాణాలు మార్చుకోవడానికి, సమాజంతో పోటీపడి జీవించడానికి, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి చదువు చాలా ముఖ్యమని తెలిపారు.ప్రతి పేదవారు, గిరిజనులు, అణగారిన వర్గాల ప్రజలు గౌరవంగా సమాజంలో జీవించడానికి వారి పిల్లలను చదివించాలని కోరారు. చదువు పిల్లల భవిష్యత్తును మారుస్తుందని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల ఉన్నత చదువులకు ఆర్థిక భారమే కారణమైతే ఆ భారంలో తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్, వ