పర్వతగిరిలో 24న హిందూ సమ్మేళన సభ
పర్వతగిరిలో 24న హిందూ సమ్మేళన సభ
పర్వతగిరి మండల కేంద్రంలోని జేఆర్ఆర్ గార్డెన్లో ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు హిందూ సమ్మేళన సభ నిర్వహించనున్నారు.సభను విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన నేతలు పిలుపునిచ్చారు.
మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం కరపత్రాలను విడుదల చేశారు. నేతలు మాట్లాడుతూ..
“హిందూ ధర్మం,సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు చాటిచెప్పి సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నాం.లోక కళ్యాణం కోసం హిందూ సమాజం మేలుకోవాలి.గడప లోపల కులం, గడప దాటితే మనమంతా హిందువులం.దేశాన్ని విశ్వగురువుగా నిర్మించడమే లక్ష్యం”అని అన్నారు.సమ్మేళనానికి ముఖ్య వక్తలుగా సంగవక్త లక్ష్మణ సుధాకర్, మహిళా వక్త జర్నలిస్టు నవత,జ్ఞాన చైతన్య నందస్వామి హాజరుకానున్నారు.ప్రతి గ్రామం నుంచి హిందువులు భారీగా తరలిరావాలని కోరారు.అనంతరం నూతన మండల కమిటీని ఏర్పాటు చేశారు.అధ్యక్షులుగా సర్పంచ్ చీదురు శంకర్, అధ్యక్షులుగా చీదురాల వేణుగోపాల్ ఎన్నికయ్యారు.కమిటీ సభ్యులుగా ప్రతాప్ రెడ్డి, చెవ్వు రాము,సురేందర్ రావు, సంపెల్లి పరమేశ్వర్ రావు, తీగల విరస్వామి,రంగు జనార్ధన్, జూలపల్లి రాములు,సముద్రాల మల్లికార్జున్, గణేష్,పోకల శంకర్, రాణా ప్రతాప్,కోల్లూరి రవి,మధు, మహిళా నేతలు భాగ్యలక్ష్మి, సుభాషిని, కృష్ణవేణి, హరిత, సునిత, మాధవి ఎన్నికైనారు.