మే 10న బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు
మే 10న బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు
నర్సంపేట బీజేపీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఈరోజు పత్రిక సమావేశం ఏర్పాటు చేయడమైనది ఈ సమావేశంలో బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 10,న పర్యటించనున్నారని, ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 3:00 గంటలకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు, దక్షిణాది రాష్ట్రాలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకే ఈ సభ. పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లుకు వ్యతిరేకంగా పనిచేసిన కాంగ్రెస్ విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసి, రైతులను, మహిళలను, నిరుద్యోగులను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై జనంలో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని, బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని చాటిచెప్పేందుకే ఈ సభ. ప్రధాని మోదీ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నాయకులు పాల్గొంటారని కాబట్టి నర్సంపేట నియోజకవర్గం నుండి మహిళలు, యువత, రైతులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు భారీగా తరలివచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వడ్డేపల్లి నరసింహ రాములు గారు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ గారు, ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు పార్లమెంటు కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి నియోజకవర్గం బిజెపి నాయకులు జూలూరి మనీష్ గౌడ్ వనపర్తి మల్లయ్య కోమల్ రెడ్డి పాలడుగుల జీవన్ నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, నల్లబెల్లి మండల అధ్యక్షులు తడక వినయ్ గారు, నర్సంపేట రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ దుగ్గొండి మండల అధ్యక్షులు నేదురు రాజేందర్ ఖానాపూర్ మండల అధ్యక్షులు రాదారపు అశోక్ చెన్నారావుపేట మండలం అధ్యక్షులు శేఖర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు దుంక దువ్వ రంజిత్ మాజీ ఎం.పి.టి.సి భాషా బోయిన రాజు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్ మహిళా నాయకురాలు వసంతకుమారి వివిధ మండలాల ప్రధాన కార్యదర్శిలు ఉపాధ్యక్షులు, యువ మోర్చా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు