ఆర్టీసీ ఉద్యమ చరిత్రలో శంకర్ గౌడ్ త్యాగం వెలకట్టలేనిది
శంకర్ గౌడ్ బలిదానంతోనే ప్రభుత్వం దిగి వచ్చి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేరాయి
- ఆర్టీసీ ఉద్యమ చరిత్రలో శంకర్ గౌడ్ త్యాగం వెలకట్టలేనిది
- ఆర్టీసీ సమ్మె పై స్పందించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు
- శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించాలి
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
తెలుగు గళం న్యూస్ నర్సంపేట ఏప్రిల్ // 27
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆర్ టి సి డిపో వద్ద ఆత్మ బలిదానం చేసుకున్న కోలా శంకర్ గౌడ్ కుటుంబాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్, బీసీ విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్ లు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్టీసీ సమ్మె విజయవంతం కావడం కార్మికుల డిమాండ్లు ప్రభుత్వం పరిష్కారానికి ముందుకు రావడం శంకర్ గౌడ్ బలిదానం వల్లనే సాధ్యమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇటీవల ఆర్టీసీ సమ్మె సందర్భంగా మొదటగా నర్సంపేట డిపో వద్ద శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ముత్తోజిపేట గ్రామంలో శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యమంలో శంకర్ గౌడ్ బలిదానం వృధా కాలేదని, ఆయన బలిదానంతోనే రాష్ట్ర ప్రభుత్వం బెంబేలెత్తి ఆర్టీసీ జేఏసీ పెట్టిన అన్ని డిమాండ్లను పరిష్కరించడానికి ముందుకు వచ్చి జేఏసీతో చర్చించి చర్చలను ఫలప్రదం చేసిందని ఆయన తెలిపారు. ఆర్టీసీ సమ్మెను విజయవంతం చేయడంలో బీసీ కార్మికులే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారని ఇందుకు శంకర్ గౌడ్ త్యాగమే సాక్ష్యం అని ఆయన అన్నారు. ఆర్టీసీ సమ్మెను నివారించి జేఏసీతో చర్చించి కార్మికుల డిమాండ్ అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఇదే సమయంలో కాగితాల రూపంలో కాకుండా ఆచరణలో అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానీకి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలనీ, ఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణం చేపట్టాలని వారి కుటుంబ సభ్యులకు తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇకముందు తెలంగాణలో ఏ ఉద్యమంలోనైనా శంకర్ గౌడ్ లాగా ఎవరు కూడా బలిదానాలు చేసుకో వద్దని బలిదానాల ద్వారా పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని బలిదానాలు బహుజనులు చేసుకుంటే అధికారం అగ్రకులాలు అనుభవిస్తున్నారని ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గమనించాలని ఆయన కోరారు. ఇక తెలంగాణలో శంకర్ గౌడ్ బలిదానమే చివరిది కావాలని బీసీలు చేయాల్సింది బలిదానాలు కాదని బరిగీసి కొట్లాడి హక్కులు సాధించుకోవాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.
ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి నిరంజన్ మాట్లాడుతూ
శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వంతో పాటు ఆర్టీసీలోని కార్మిక సమాజం అండగా నిలబడాలని అందుకు అనుగుణంగా తమ వేతనాలు నుండి కొంతమేరకు శంకర్ గౌడ్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు బండి స్వామి, కృష్ణ, గడ్డం యాదగిరి, శ్రీనివాస్, ఉపేందర్, బీసీ ఆర్ టి సి ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ అధ్యక్షులు గొలనకొండ వేణు, జిల్లా ఉపాధ్యక్షులు చెన్నూరు రవి ముదిరాజ్, జిల్లా కార్యదర్శులు గొడిశాల అశోక్ గౌడ్, సంగెం రమేష్, జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్, చెన్నారావుపేట మండల అధ్యక్షులు బర్ల యాకయ్య, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యాం కుమార్ యాదవ్, పట్టణ యూత్ అధ్యక్షుడు గోపగాని నాగరాజ్, బీసీ ఆర్టీసీ వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల రవి, బీసీ ఆర్టీసీ నర్సంపేట డిపో అధ్యక్ష కార్యదర్శులు కందికొండ మోహన్, బొడిగె రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిశెట్టి రంగయ్య, గూడూరు మండల అధ్యక్షుడు పాపని శ్రీనివాస్, కార్యదర్శులు శీరంశెట్టి రాజేందర్ పెరక, గాండ్ల శ్రీనివాస్, వరుణ్ లతో పాటు బీసీ సంఘం నాయకులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.