ధాన్యం,మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం తీవ్ర జాప్యం. జూలకంటి రంగారెడ్డి
ధాన్యం,మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం తీవ్ర జాప్యం.
జూలకంటి రంగారెడ్డి
మాజీ MLA,
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు”
మధిర, ఏప్రియల్27 (తెలుగుగళం) న్యూస్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని మాటలు చెబుతున్నారు తప్ప ఆచరణలో తీవ్రమైన ఆలస్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి స్థానిక వ్యవసాయ మార్కెట్ లోని ధాన్యం రైతులను కలసి మాట్లాడి పరిస్థితులను తెలుసుకొని తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ కేంద్రంలో ధాన్యం రైతులు తమ పంటను ఆరబోసి వారాలు గడుస్తున్న ఇంతవరకు ఒక్క గింజను కూడా కొనుగోలు చేయలేదని ధాన్యమును ఇక్కడి నుండి తరలించలేదని రైతులు రోజువారి మారుతున్న వాతావరణ పరిస్థితులు దృశ్య వ్యవసాయ మార్కెట్ లో పడిగాపులు కాయటం జరుగుతుందని అన్నారు. రైతులు జూలకంటి రంగారెడ్డి ఎదుట వాపోయారు. గన్ని బ్యాగులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు కాటా వేస్తారో ఎప్పుడు లోడ్లను తరలిస్తారో ఎప్పుడు పంట డబ్బులు తమ అకౌంట్లో జమ అయితాయో అంతా అయోమయంగా ఉందని అన్నారు. రైతుల పట్ల ప్రభుత్వ పనితీరు ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఏమిటి అని ప్రశ్నించారు? ఉపముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లోని ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి చెప్పనక్కరలేదని అన్నారు. పలు గ్రామాలలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసివేసి రైతులను నిరుత్సాహ పరుస్తున్నారని అన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని గన్ని బ్యాగులను సప్లై చేయాలని కాటాలు వేయాలని కాటాలు వేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలులో మరియు మొక్కజొన్నలు కొనుగోలులో అవసరం లేని షరతులు విధించి రైతులు అందరూ తమ పంటను అమ్ముకునేందుకు అవకాశాన్ని లేకుండా చేశారని అన్నారు ప్రభుత్వం నిర్దేశించిన బస్తాల సంఖ్య కంటే ఎక్కువగా పండించిన రైతులు తమ పంటను ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు? ఆన్లైన్ సమస్యలు పట్టాదార్ పాస్ బుక్ సమస్యలు కౌలు రైతుల సమస్యలు ఉన్న పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలి అని అన్నారు కాబట్టి వట్టి వాగ్దానాలు పక్కన పెట్టి వెంటనే రైతాంగం పండించిన పంటను షరతులు లేకుండా కొనుగోలు చేసి డబ్బులను ఎకౌంట్లో వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలో ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో: సిపిఎం మాజీ జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు పార్టీ డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శీలం నరసింహారావు మరియు కిలారి సురేష్ మండవ పనింద్ర కుమారి రైతులు పాల్గొన్నారు.