స్టేషన్ ఘనపూర్ లో తొలి‘ప్రజావాణి’కార్యక్రమం

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్, మే 4
ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా స్టేషన్ ఘనపూర్ ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ డి.ఎస్. వెంకన్న ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, రైతులు భూ వివాదాలు, సంక్షేమ పథకాలు, ఇతర సమస్యలపై తమ వినతులను సమర్పించారు.మొత్తం 30 దరఖాస్తులను స్వీకరించిన ఆర్డీఓ, వాటిని సంబంధిత శాఖలతో సమన్వయం చేసి గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.కార్యక్రమంలో రెవెన్యూ విభాగంతో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొని, బాధితులకు సూచనలు అందించారు.ఇకపై ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామని ఆర్డీఓ డి.ఎస్. వెంకన్న తెలిపారు. ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు.