BREAKING NEWS
వరంగల్లో ఎంసెట్ పరీక్షకు ఆలస్యంగా చేరిన 15 మంది విద్యార్థులకు నిరాశ

ఈ69న్యూస్ వరంగల్ మే04
వరంగల్ జిల్లాలో ఎంసెట్ పరీక్షకు నిమిషం ఆలస్యంగా చేరుకున్న కారణంగా 15 మంది విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. తొర్రూరు, గూడూరు, కురవి తదితర దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పరీక్ష రాయలేక వెనుదిరగాల్సి వచ్చింది.పరీక్ష సమయ నియమాలను కఠినంగా అమలు చేసిన అధికారులు, ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు.ఎంతోకాలంగా కష్టపడి చదివిన విద్యార్థులకు కేవలం నిమిషం ఆలస్యమే పెద్ద అడ్డంకిగా మారింది.ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొంత వెసులుబాటు కల్పించాలని అధికారులను కోరుతున్నారు.