అకాల వర్షం కురిసి రైతులను తీవ్రంగా దెబ్బతీసింది.
నెక్కొండలో అకాల వర్షం-తడిసిన ధాన్యం
తెలుగు గళం న్యూస్ వరంగల్ మే03
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో అకాల వర్షం కురిసి రైతులను తీవ్రంగా దెబ్బతీసింది.ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన మొక్కజొన్న, వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.ఆరు నెలలు కష్టపడి పండించిన పంట కళ్లముందే నష్టపోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు ఆలస్యం జరుగుతుండగా, ఈ అకాల వర్షం పరిస్థితిని మరింత విషమం చేసింది.తడిసిన ధాన్యం నాణ్యత తగ్గిపోవడంతో ధరలు పడిపోతాయని రైతులు భయపడుతున్నారు.తక్షణమే కొనుగోలు చర్యలు చేపట్టి, తార్పాలిన్ వంటి రక్షణ సదుపాయాలు కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.అధికారులు వెంటనే స్పందించి రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు