5 సంవత్సరాలు పూర్తయిన పిల్లలను పాఠశాలలో జాయిన్
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలు స్త్రీలు బాలింత స్త్రీలు,వారి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో ఒక పూట భోజనంతోపాటు,పాలు,గుడ్లు అందిస్తున్నారని దీనిని అందరూ సద్వినియోగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యగా ఉండాలని కోరారు..మరిపెడ మండలం రాంపురం గ్రామం లోని అంగన్వాడి కేంద్రం అందరికీ ఆదర్శంగా పనిచేస్తుందని, అంగన్వాడీ ఒకటి, మూడవ సెంటర్ నిర్వాహకులు యం. యశోద, జీ. లలిత మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆటపాటలు,విద్యను అందిస్తూ పాఠశాలకు సంసిద్ధులను చేస్తున్నాము 5 సంవత్సరాలు పూర్తయిన పిల్లలను పాఠశాలలో జాయిన్ చేయించుకుంటున్నాము అని తెలియజేశారు.దానిలో భాగంగానే గ్రాడ్యుయేషన్ డే నిర్వహించుకోవడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో టీచర్స్ మరియు సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు, సమాజానికి ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని,అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిల్లల తల్లులకు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఒన్ సెంటర్ యం యశోద, త్రీ సెంటర్ జీ లలిత, హెల్త్ డిపార్ట్మెంట్ మహబూబి, ఆశలు అనురాధ, శారదా, ఆయమ్మ జీ నాగమ్మ,విద్యార్థులు పాల్గొన్నారు