ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
దేశాభివృద్ధిలో కీలకమైన జనగణన కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు.మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆయన స్వయంగా ఆన్లైన్ ద్వారా తన వివరాలను ‘స్వీయ గణన’ (Self-Enumeration) చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జిల్లాలో ఈ నెల 26న ప్రారంభమైన ఈ డిజిటల్ నమోదు ప్రక్రియ మే 10వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.ప్రజలు https://se.census.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ మొబైల్ నంబర్ మరియు ఓటిపి ద్వారా లాగిన్ అయ్యి, జిల్లా, గ్రామం, పిన్ కోడ్ వంటి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.ఇలా ఆన్లైన్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు.ముఖ్యంగా, ఆన్లైన్ నమోదు పూర్తికాగానే వచ్చే ఐడి (ID) నంబర్‌ను ప్రజలు జాగ్రత్తగా భద్రపరచుకోవాలని, మే 11వ తేదీ నుండి ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వచ్చినప్పుడు ఈ నంబర్‌ను వారికి తెలియజేయాలని ఎమ్మెల్యే వివరించారు.జిల్లా ప్రజలందరూ ఈ జనగణనలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఓ జవహర్,డిప్యూటీ ఎస్ఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు.