తెలంగాణలో పదో తరగతి ఫలితాలు
తెలుగు గళం న్యూస్ వరంగల్/ఏప్రిల్ 28
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు ఈరోజు అనగా ఏప్రిల్ 29వ తేదీ బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నాం 2 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.
ఈ ఏడాది మార్చి 14 నుంచి ప్రారంభమైన ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 13న పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 23వ తేదీతో జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి కాగా, ఫలితాల విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.ఫలితాలు చూసుకునే వెబ్సైట్లు: https://bse.telangana.gov.in*
https://results.bse.telangana.gov.in విద్యార్థులు హాల్ టికెట్ నంబర్‌తో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఫలితాల విడుదల అనంతరం మార్కుల మెమోలను సంబంధిత పాఠశాలల్లో అందజేయనున్నారు.