

ఈ69న్యూస్ హైదరాబాద్, ఏప్రిల్ 28
రాష్ట్ర వైద్య శాఖలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపించారు.రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఔషధాల కొనుగోలు, నిల్వల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయని అన్నారు. అవసరానికి మించి మందులు కొనుగోలు చేసి, కాలం చెల్లిన మందులను సెంట్రల్ మెడికల్ స్టోర్లలో నిల్వ ఉంచినట్లు పేర్కొన్నారు. అనంతరం వాటిని బయో వెస్ట్గా తొలగించేందుకు ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.అదేవిధంగా, ప్రభుత్వానికి అవసరమైన వైద్య పరీక్షల కెమికల్స్‌ను 100 నుంచి 200 శాతం అధిక ధరలకు కొనుగోలు చేసి ప్రజల ధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. ఇండెంట్ విధానం పాటించకుండా కొనుగోళ్లు జరిగినట్లు పేర్కొన్నారు.ఈ అంశంపై వైద్య శాఖ అధికారులు, ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో డాక్టర్ సమత, డాక్టర్ రాహుల్, అంజి రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.