కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగిన తాటికొండ రాజయ్య
జనగాం జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.స్టేషన్ ఘనపూర్ వేదికగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య,ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
“నకిలీ ఎన్కౌంటర్లకు రారాజు”
సమావేశంలో మాట్లాడిన రాజయ్య,కడియం శ్రీహరి గత రాజకీయ చరిత్రను ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.“కడియం శ్రీహరి నకిలీ ఎన్కౌంటర్లకు రారాజు.ఆనాడు దళితులపై అణచివేతకు పాల్పడిన చరిత్ర ఆయనది”అంటూ విమర్శించారు.కార్యకర్తల శ్రమతో గెలిచి,అదే కార్యకర్తలపై కేసులు పెట్టించడం అన్యాయమని నిలదీశారు.
చిటికెలు వేస్తూ బహిరంగ సవాల్
రాజయ్య సమావేశంలో చిటికెలు వేస్తూ కడియం శ్రీహరికి బహిరంగ సవాల్ విసిరారు.“బిఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు.దమ్ము,ధైర్యం ఉంటే రా..నువ్వో నేనో తేల్చుకుందాం”అంటూ హెచ్చరించారు.అరెస్టులు,పోలీసుల నిర్బంధాలకు భయపడబోమని స్పష్టం చేశారు.
రాజీనామా చేయాల్సిందేనన్న డిమాండ్
కడియం శ్రీహరి వైఖరిపై రాజయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.నైతికత ఎక్కడ?బిఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం సిగ్గుచేటన్నారు.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు.గ్రామాల్లో తిరిగితే అడ్డుకుంటాం అని హెచ్చరించారు.స్పీకర్‌కు ఇచ్చిన అఫిడవిట్‌ను “రాజకీయ డ్రామా”గా అభివర్ణించారు.
“తస్మాత్ జాగ్రత్త”
హెచ్చరిక“వైఖరి మార్చుకోకపోతే రాజకీయంగా తగిన బుద్ధి చెబుతాం.నీపై బహిష్కరణ వేటు తప్పదు”అంటూ రాజయ్య తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.రాజయ్య వ్యాఖ్యలతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రాజకీయ ఉత్కంఠ పెరిగింది.దీనిపై కడియం శ్రీహరి వర్గం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సి ఉంది