◆ముస్లింల ల్యాండ్రీలకు,ధోబీ ఘాట్లకు 250యూనిట్ల ఫ్రీ కరంటుపై గోపి రజక ఫైర్


   హైదరాబాద్ జిల్లా నల్లకుంట శతాబ్ధి భవనంలో  తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా సంయుక్త కార్యదర్శి తిప్పరాజు కృష్ణయ్య అధ్యక్షతన 21-9-2023 గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొమ్మరాజు కృష్ణ హాజరై మాట్లాడుతూ ముస్లింల ధోబి ఘాట్లకు, లాండ్రీ షాపులకు 250 యూనిట్లు ఉచిత కరెంటు స్కీమును అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నిర్ణయంతో తరతరాలుగా దోబీ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న రజక కులస్తులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని అంతేకాకుండా వృత్తిదారుల కుటుంబాలు రోడ్డున పడతారని వారన్నారు. ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తూ ముస్లింలకు లబ్ధి పరచడం వృత్తిపై ఆధారపడిన రజక కులస్తుల వృత్తిని నాశనం చేయడం తగదన్నారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ముస్లింలను సంతోష పరచడానికి బీసీల బతుకులు రోడ్డుపాలు చేయడం సబబు కాదని అభిప్రాయపడ్డారు .రజక కులస్తుల అభివృద్ధికి వెన్నంటి ఉంటామని చెప్పినా ప్రభుత్వం నేడు ఈ విధంగా చేయడం సరైనది కాదని దీనికి సరైన మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వారు అన్నారు. రాష్ట్రంలో ఉన్న రజక కులస్తులు దీన్ని గమనించి రానున్న రోజుల్లో ఓటు ద్వారా సమాధానం చెప్పాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాం .కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి మా ప్రభుత్వం వెన్నంటి ఉంటుందని చెప్పి నేడు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం ఆలోచించాలని వారన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *