హనుమకొండ: జాతీయ ఉద్యమంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్ఫూర్తితో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ)అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తుందని యువత పోరాటాలకు సిద్ధం కావాలని డివైఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి పిలుపునిచ్చారు.
గురువారం హనుమకొండ రాంనగర్ సుందరయ్య భవన్ లో డివైఎఫ్ఐ 43వ, ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా డివైఎఫ్ఐ జెండాను జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ ఎగరవేశారు.
ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖ్ దేవ్, అల్లూరి, చంద్రశేఖర్ ఆజాద్, లాంటి విప్లవ వీరుల స్ఫూర్తితో 1980 పంజాబ్ రాష్ట్రంలో లూథియానాలో ఏర్పడ్డ డివైఎఫ్ఐ నాటి నుంచి నేటి వరకు దేశంలో యువత కోసం అనేక ఉద్యమాలు నిర్వహించిందని, డివైఎఫ్ఐ జెండాను నిలబెట్టడం కోసం ఎంతోమంది యువజన సంఘం నాయకులు ప్రాణాలర్పించారని, పాలకుల యువజన వ్యతిరేక విధానాలపై, సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా నిలబడిందని, మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమంటూ, గలాన్ని వినిపించింది డివైఎఫ్ఐ, అందరికీ విద్య, ఉపాధి కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ త్యాగం, పోరాటం, పురోగతి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు, ఆశయాల బాటలో అలుపేరగని పోరాటాలు నిర్వహిస్తూ 43 ఏళ్ల నుంచి యువత గుండె చప్పుడుగా డివైఎఫ్ఐ నిలిచిందన్నారు. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగిన స్పందించడానికి సిద్ధంగా ఉండు అనే చేగువేరా స్పూర్తితో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందిస్తుంది డివైఎఫ్ఐ. సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడం కోసం జీవితాంతం కృషిచేసిన మహనీయులు అంబేద్కర్, జ్యోతిరావు పూలే ,సావిత్రిబాయి స్ఫూర్తితో డివైఎఫ్ఐ పనిచేస్తుందన్నారు. నవ సమాజ నిర్మాణం కోసం డివైఎఫ్ఐ చేస్తున్న పోరాటాల్లో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మంద సుచందర్, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఓర్సు చిరంజీవి, నాయకులు సముద్రాల అనిల్, శివరాత్రి కర్ణాకర్, వంగాల ప్రణయ్, అశోక్ ,సతీష్ పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *