bhadradri kothagudem newsbhadradri kothagudem news

15 తులాలు బంగారం ఒక ప్యాషన్ ప్రొ మోటార్ సైకిల్ స్వాధీనం.
నెలరోజుల క్రితం భూపాలపల్లికి చెందిన దురిశెట్టి స్వామి నిరంజన్ అనే దొంగ మరి కొంత మంది భద్రాచలం లోని గోల్డుస్మిత్ కాలనీ కి చెందిన ఉండు మాధవ రావు అనే వ్యక్తి యొక్క ఇంట్లోకి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువా పగులగొట్టి దానిలో ఏమి దొరక్కపొతే ఇంటి ముందు నిలిపి ఉంచిన హోండా షైన్ బండిని దొంగిలించాడు. ఇట్టి పిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు లో భాగంగా, 20.11.2023 ఈ దొంగతనము కి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు మైపా నవీన్, పూజారి సూర్య ప్రకాష్ మరియు సాయి తేజను వారి దగ్గర నుండి హోండా షైన్ మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. తిరిగి ఇట్టి కేసులో మెదటి ముద్దాయి అయిన దురిశెట్టి స్వామి నిరంజన్ ఈ రోజు ఫారెస్ట్ చెక్ పోస్ట్ వాహన తనిఖీ చేస్తుండగా సారపాక వైపు నుండి భద్రాచలంనకు దొంగ మోటార్ సైకిల్ పై వస్తుండగా పట్టుకుని విచారించగా, ఇట్టి వ్యక్తి ఇంతకు ముందు పలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చా తరువాత కూడా దొంగతనాలు చేశాడు. ఈ కేసు తో పాటు మణుగూరు, గోదావరిఖని లో కూడా దొంగతనాలు చేసి ఆ దొంగతనం చేసిన బంగారాన్ని అతని స్నేహితుడు అయినా సాయి తేజకి ఇచ్చి గుర్తుతెలియని వ్యక్తులు అమ్ముకొని రమ్మని చెబుదామని వెళ్తుండగా పట్టుకోవడం జరిగింది. అతని నుండి రెండు ప్రాంతాలలో దొంగిలించిన 15 తులాలు బంగారు వస్తువులు మరియు ఒక ప్యాషన్ ప్రొ మోటార్ సైకిల్ ను స్వాదినాపర్చుకొని భద్రాచలం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించానైనది.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *