-భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ (యం.యల్) సెక్రటరీ కామ్రేడ్
జే .ఎస్ .ఆర్

లోక్సభలో ఇద్దరు వ్యక్తులు ప్రమాదం లేని పొగ సెల్సుతో ప్రవేశించడం భద్రతా వైఫల్యంతో పాటు, వారు చేసిన నినాదాలు రాజ్యాంగాన్ని రక్షించండి, నిరంకుశత్వం, నియంతృత్వం నశించాలనే నినాదాలు, జైభీమ్ అనే నినాదాలు వారి మానసిక ఆవేదనను తెలియజేస్తున్నాయనీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎమ్ ఎమ్ ఎల్ సెక్రటరీ కామ్రేడ్ జై బోరన్న గారి సుభాష్ చంద్రబోస్
రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ పేర్కొన్నారు.

ఇటువంటి చర్యలు వారి మిలిటెంట్ ఉగ్రవాద చర్య. ఇది సరైన విధానం కాదనీ కామ్రేడ్
జే ఎస్ ఆర్ పేర్కొన్నారు.

భద్రతా వైఫల్యంపై తగు విచారణ జరిపి తగు భద్రతా చర్యలు తీసుకోవాలనీ కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్
జైబోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు.

అలానే భారత పార్లమెంటు 370 ఆర్టికల్ రద్దుతో సహా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల ప్రవచిత మనువాద, ఫాసిస్టు చట్టాలను యదేచ్ఛగా అమలు చేసుకుంటూ పోతున్నదనీ బహుజన శ్రామిక వర్గ ఉద్యమకారుడు కామ్రేడ్
జే ఎస్ ఆర్ ఆరోపించారు

370 ఆర్టికల్ రద్దుపై, కాశ్మీర్ను రెండు ముక్కలుగా విడగొట్టిన తీర్పుపై చివరి ఆశగా వున్న ఉన్నత న్యాయస్థానం సైతం ప్రజాస్వామిక, ఫెడరల్ విలువలను గుర్తించలేక పోయిందనే ఆవేదన ప్రజాస్వామిక వాదుల నుండి వ్యక్తం అవుతున్నదనీ పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడుతున్న కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ వెల్లడించారు.

బీజేపీ ప్రభుత్వం ఉపా లాంటి చట్టాలు, రాజద్రోహ చట్టాలు మోపి ప్రతిపక్ష ప్రజాస్వామ్య, మైనార్టీ గొంతు లేకుండా చేసే యత్నాలు సమాజంలో అసహనాన్ని పెంచుతున్నాయనీ నూతన ప్రజాస్వామిక విప్లవ సమసమాజ స్వప్నికుడు, కార్మిక ,కర్షక శ్రామిక వర్గ మట్టి మనుషుల బోరపుత్రుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ పేర్కొన్నారు.

భారత రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగం రాబోతుందన్న ఆందోళన నుంచి ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయనీ ,భగత్ సింగ్, భటుకేశ్వర దత్తు బ్రిటీష్ నల్ల చట్టాలకు వ్యతిరేకంగానే పార్లమెంటులో ప్రమాదరహిత పొగ బాంబులు వేశారనీ… పేర్కొన్న జెఎస్ఆర్ నేడు అదే పద్ధతి కన్పిస్తున్నదనీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ తెలిపారు.

ఏది ఏమైనా ఇలాంటి చర్యలు ఫాసిస్టు పాలకులకు మరిన్ని కోరలు పెరగడానికి తొడ్పడతాయనీ… శ్రామిక ప్రజా నేస్తం కామ్రేడ్ జే ఎస్ ఆర్ తెలిపారు.

ఇలాంటి టెర్రరిస్టు పద్ధతులు సరికావనీ… ప్రజల, ప్రజాస్వామికవాదుల, లౌకికవాదుల, మతోన్మాద వ్యతిరేకుల ప్రజాసమీకరణ, ప్రజా ఉద్యమం ద్వారానే పాలకుల ఫాసిస్టు, దురహంకార, దుర్నితీకర చట్టాలను, పద్ధతులను ఓడించగలుగుతారనీ, పాలకవర్గాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలను చైతన్యం చేయడం ద్వారా, ప్రజల ప్రతిఘటన శక్తిని బలోపేతం చేయడం ద్వారా ఓడించగలుగుతామని, వ్యక్తిగత హింస వాదానికి తావు లేకుండా వ్యవస్థ మార్పు కోసం ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని… నూతన ప్రజాస్వామ్య విప్లవ పోరాటాన్ని దేశవ్యాప్తంగా బలోపేతం చేయడం ద్వారా మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేయగలుగుతామని… యువతరం కమ్యూనిజన్ని చదవాలని, సమసమాజ స్థాపనలో జరుగుతున్న ప్రజా పోరాటాలలో భాగస్వాములు కావాలని బలహీనవర్గాల బంధువు, పేద వర్గాల పెన్నిధి

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *