telugu galam news e69news local news daily news today newstelugu galam news e69news local news daily news today news

వైరా గురుకులంలో పాము కాటుకు గురైన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్,యస్.యఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కోట.ప్రేమ్ కుమార్, ఐద్వా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల.రజిత లు డిమాండ్ యస్.యఫ్.ఐ,డి.వై.యఫ్.ఐ,ఐద్వా ఆధ్వర్యంలో వైరా సోషల్ వెల్ఫేర్ గురుకులం ముంధు ధర్నా, సందర్శన ఆర్.సి. ఓ పర్యవేక్షణ లేక అడవిని తలపిస్తున్న వైరా టి.యస్.డబ్లు.ఆర్.యస్ గురుకుల విద్యాలయం వైరా పట్టణం(జనవరి 23):వైరా టి.యస్.డబ్లు.ఆర్.యస్ గురుకుల విద్యాలయంలో ఆర్.సి.ఓ పర్యవేక్షణ చేయకుండా,విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటున్న ఫలితంగా అడవిని తలపిస్తుందని వెంటనే సోషల్ వెల్ఫేర్ గురుకుల రీజనల్ కో- ఆర్డినేటర్(ఆర్.సి.ఓ) నీ సస్పెండ్ చేయాలనీ,పాము కాటుకు గురైన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలనీ డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్,యస్.యఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కోట.ప్రేమ్ కుమార్, ఐద్వా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల.రజిత లు డిమాండ్ చేశారు. యస్.యఫ్.ఐ,డి.వై.యఫ్.ఐ,ఐద్వా ఆధ్వర్యంలో వైరా టి.యస్.డబ్లు.ఆర్.యస్ గురుకుల విద్యాలయం ముంధు ధర్నా నిర్వహించి,పర్యటించి విద్యార్థినీలతో, ప్రిన్సిపల్, సిబ్బందితో మాట్లాడటం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురుకులంలో విపరీతంగా చెట్లు చెత్త చెదారం పేరుకుపోయి ఉందని, ఫలితంగా విష పాములు,పురుగులు, తేళ్ళు సంచరిస్తునాయని వారు అవేదన వ్యక్తం చేశారు.జిల్లా ఆర్.సి.ఓ ప్రత్యూష గారు కనీసం ఆ గురుకులంనీ ఇంతవరకు సందర్సించలేదని,సందర్శించినట్లు రిజిస్టర్ సంతకాలు చూపించమని అడిగితే సిబ్బంది ఎవరూ స్పందించడం లేదని వారు తెలిపారు.నెలకి ఒకసారి గురుకుల హాస్టల్స్ నీ సందర్శించాలని నిబంధనలు ఉన్న ఆర్.సి.ఓ మాత్రం ఏదో ఒక కార్యక్రమానికి అతిథిగా హాజరై వెల్లిపోతునారన్ని, విద్యార్ధినీలతో మాట్లాడకుండ సమస్యలు తెలుసుకోకుండా అడవిడిగా వెళ్ళిపోతుంన్నట్లు.ఫలితంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకులాలు అన్ని సమస్యలకూ నిలయాలుగా మారాయని,గతంలో వివిధ కారణాలతో కుడా విద్యార్థులు చనిపోయారని అన్నారు.వైరా టి.యస్.డబ్లు.ఆర్.యస్ గురుకుల విద్యాలయంలో ఆర్.సి.ఓ పర్యవేక్షణ చేయకుండా,విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటున్న ఫలితంగా అడవిని తలపిస్తుందని వెంటనే జిల్లా కలెక్టర్, ఉన్నత అధికారులు స్పందించి సోషల్ వెల్ఫేర్ గురుకుల రీజనల్ కో- ఆర్డినేటర్(ఆర్.సి.ఓ) నీ సస్పెండ్ చేయాలనీ,పాము కాటుకు గురైన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలనీ వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో భవిష్యత్ లో ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐద్వా వైరా పట్టణ నాయకురాలు భూక్యా.విజయభాయ్,డి వై.యఫ్.ఐ పట్టణ అధ్యక్షుడు చితారు.మురళి, యస్.యఫ్.ఐ, డి.వై.యఫ్.ఐ పట్టణ నాయకులు విక్రంత్,వెంకటేష్, సాయి, కమల్,మనోహర్,రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *