telugu news local news telugu galam news suryapet newsనారాయణ గూడెం లో తొమ్మిదేళ్ల క్రితం విద్యుత్తు సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధం..

కనుకరించని అధికారులు – ప్రజాప్రతినిధులు..

నారాయణ గూడెం లో తొమ్మిదేళ్ల క్రితం విద్యుత్తు సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధం..

గూడు నిర్మించుకుందామని కూడబెట్టుకున్న రూ. 4 లక్షలు అగ్ని కి హాహుతి..

తొమ్మిదేళ్లు గడిచిన ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు..

ఏడడుగుల బంధం పూరి గుడిసెలోనే జీవనం..

ప్రజా ప్రతినిధులు. అధికారుల వాగ్దానాలు నీటి బుడగలేనా?

తెలుగు గళం న్యూస్ మునగాల ప్రతినిధి మార్చి 18

కోదాడ నియోజకవర్గం మునగాల మండలంలోని నారాయణ గూడెం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గడ్డం కోటిలింగం. సైదమ్మ జీవనం కొనసాగిస్తున్నారు. అప్పన్న హస్తం కోసం తొమ్మిదేళ్లు గడిచిన కోటిలింగం. సైదమ్మ కుటుంబం కన్నీటి గాధ..
బతుకుదెరువు భారమై కుటుంబాన్ని పోషించలేక ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు. ఆరోగ్యం సహకరించక ప్రతిక్షణం మనోవేదనతో బాధపడుతున్న కోటిలింగం కుటుంబం దీనగాధను వారి కుటుంబ పరిస్థితులను చూసి మనసున్న ప్రజాప్రతినిధులు. అధికారులు ఆలోచన చేయండి. వారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం సాయం చేయమని కోరుకుంటున్నారు. వివరాలలోకి వెళితే గడ్డం కోటిలింగం కుటుంబం గ్రామంలో గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు 2015 డిసెంబర్ లొ తన ఇంటి ఎదుట ఉన్న విద్యుత్ స్తంభంపై తీగలు విద్యుత్తు సర్క్యూట్ అయి గుడిసెతోపాటు ఇంట్లోనే సామాగ్రి. రూ. 4 లక్షల నగదు కాలి బూడిదయ్యాయి. గూడు కట్టుకుందామని పైసా పైసా కూడబెట్టిన సొమ్ము అగ్నికి ఆహుతి కావడంతో కోటిలింగం కుటుంబం వీధిన పడింది. అగ్ని ప్రమాదంలో గుడిసెలో ఉన్న 50 బస్తాల వరి ధాన్యం. భూమి పట్టాదార్ పాస్ పుస్తకం. ఆధార్ కార్డు లు. బట్టలు. వంట సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆనాటి ప్రభుత్వం నుంచి తమకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని అధికారులు. ప్రజాప్రతినిధులను వేడుకుంది కోటిలింగం కుటుంబం. హుటా హుటిన అధికారులు ప్రజాప్రతినిధులు ఇల్లు కట్టిస్తామని వాగ్దానాలు చేశారే కానీ అప్పటి నుండి పలకరించే నాధుడే కరువయ్యారు. ఇక ప్రభుత్వం సాయం చేస్తుందని ఆనాటి నుండి 9 ఏండ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నారు కోటిలింగం దంపతులు. నాటి నుంచి నేటి వరకు అదే స్థలంలో మరో గుడిసె ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వర్షం వస్తే గుడిసెలో ఉండే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజా పాలన ప్రభుత్వంలోనైనా ఇల్లు కట్టిస్తారని ఆశగా తొమ్మిదేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు. అధికారులు చొరవ తీసుకొని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *