telugu galam news local news e69newstelugu galam news local news e69news

గళం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి (రేగొండ)
రేగొండ మండలంలోని పెద్దంపల్లి గ్రామానికి చెందిన డెఫ్ క్రికెట్ క్రీడాకారుడు పసుల రాజును కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మోడం ఉమేష్ గౌడ్ మరియు పున్నమి రవి గార్లు క్రీడాకారుడు పసుల రాజును శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మోడం ఉమేష్ గౌడ్ మాట్లాడుతూ డెఫ్ క్రికెట్లో ఇంకా బాగా రానించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మైస బీక్షపతి, వానరాశి అంజయ్, శీలవంతులు నరసింహమూర్తి తరుణ్ మేకల శివ పున్నం ప్రవీణ్ పారనందుల రమేష్, కందుకూరి సత్యం అనిల్ మరియు తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *