regonda news venugopal swamy news bhupalapally news local news e69news telugu galam newsశ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది

రేగొండ మండల కేంద్రంలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా భక్తులు రేగొండ మండలంలో ని వేణుగోపాల స్వామిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి,ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని తమ స్వామి భక్తిని చాటుకున్నారు.రేగొండ మండల కేంద్రంలో శ్రీ వేణుగోపాలస్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్బంగా స్వామి వారి కళ్యాణ మండపం నిర్మాణం భూమి పూజలో పాల్గొని ఆలయ అభివృద్ధి కొరకు10116/- రూపాయలు కోలేపాక బిక్షపతి ఆలయ అభివృద్ధి కమిటీకి విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లొ ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు లింగారెడ్డి ప్రధాన కార్యదర్శి పత్తి బుచ్చి రెడ్డి మాజీ సర్పంచ్ ఎదునుతుల విజేందర్ రెడ్డి ఎంపీటీసీ మైస బిక్షపతి పిఎసిఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి కట్ల రామిరెడ్డి వార్డు సభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి గోగుల చెంద్రకర్ రెడ్డి మొదలగు భక్తులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *