brs news mp elections news telugu galam news telugu daily e69newsసమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు

మాలోత్ కవిత గెలుపు ద్వారానే అభివృద్ధి కొనసాగుతుంది

హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

భద్రాచలం మండలం బూత్ కమిటీ ఇన్చార్జిల సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భద్రాచలం మండల బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు బూత్ కమిటీ ఇన్చార్జిల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కవిత గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉందని తెలంగాణ హక్కులు తెలంగాణ అస్తిత్వం కాపాడాలంటే పార్లమెంట్లో బిఆర్ఎస్ ఎంపీలు ఉండాలని కోరారు..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారం కొచ్చి చేతులు ఎత్తేసారని ఆరోపించారు..
మహబూబాద్ పార్లమెంటు అభివృద్ధి జరగాలంటే మాలోత్ కవిత ను గెలిపించాలని పిలుపునిచ్చారు..
ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ. మండల సమన్వయ కమిటీ సభ్యులు ఆకోజు సునీల్ కుమార్. పడిసిరి శ్రీనివాస్. ఉడతా రమేష్. రేపాక పూర్ణచంద్రరావు కోలా రాజు కాపుల సూరిబాబు నియోజవర్గ మహిళా నాయకులు వీరబోయిన వెంకట నరసమ్మ సీతా మహాలక్ష్మి మరియు మండల పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *