telugu galam letest news, telugu news, workers newsయాదగిరిగుట్ట తెలుగు గళం : జూలై 10న జరిగే కార్మికుల డిమాండ్స్ డేని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ గారు కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్ద కందుకూరులో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు ) జనరల్ బాడీ సమావేశం సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం అధ్యక్షతన జరిగింది. జనరల్ బాడీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన భూపాల్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేస్తానని చెప్పిందని, సహజ వనరులైన బొగ్గు బావులను ప్రైవేటీకరణకు పూనుకున్నదని మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా జిల్లా, మండల, పారిశ్రామిక కేంద్రాలలో కార్మికుల నిరసనలు, ధర్నాలు చేసి డిమాండ్స్ డే ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. . కార్మికులకు ఈపీఎఫ్ చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిన యాజమాన్యాలకు విధించే జరిమానాలను భారీగా తగ్గించారని, దేశ సహజ వనరులైన బొగ్గు గనులను, దేశ సంపదను అమ్ముతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనులను కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం వేలం వేస్తున్నారని దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టం చేసే లేబర్ కోళ్లను రద్దు చేయాలని కార్మికుల కనీస వేతనం 26,000 ఇవ్వాలని ,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మికుల సమస్యలపై జూలై 10 కార్మికుల కోర్కెల దినాన్ని జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు. వివిధ యూనియన్ల నుంచి సిఐటియు లో చేరికలు: జి రాజు, జి నర్సింహులు,బి నర్సింహులు, కె కుమార్,యస్ కె అబ్జల్ తదితరులు వివిధ యూనియన్ల నుండి సీఐటీయూలో చేరడం చేరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం,జిల్లా సహాయ కార్యదర్శి సుబ్బూరు సత్యనారాయణ ,ప్రీమియర్ యూనియన్ నాయకులు పుప్పాల గణేష్ తదితరులు పాల్గొన్నారు

యాదగిరిగుట్ట తెలుగు గళం : జూలై 10న జరిగే కార్మికుల డిమాండ్స్ డేని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ గారు కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్ద కందుకూరులో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు ) జనరల్ బాడీ సమావేశం సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం అధ్యక్షతన జరిగింది.
జనరల్ బాడీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన భూపాల్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేస్తానని చెప్పిందని, సహజ వనరులైన బొగ్గు బావులను ప్రైవేటీకరణకు పూనుకున్నదని మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా జిల్లా, మండల, పారిశ్రామిక కేంద్రాలలో కార్మికుల నిరసనలు, ధర్నాలు చేసి డిమాండ్స్ డే ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. . కార్మికులకు ఈపీఎఫ్ చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిన యాజమాన్యాలకు విధించే జరిమానాలను భారీగా తగ్గించారని, దేశ సహజ వనరులైన బొగ్గు గనులను, దేశ సంపదను అమ్ముతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనులను కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం వేలం వేస్తున్నారని దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టం చేసే లేబర్ కోళ్లను రద్దు చేయాలని కార్మికుల కనీస వేతనం 26,000 ఇవ్వాలని ,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మికుల సమస్యలపై జూలై 10 కార్మికుల కోర్కెల దినాన్ని జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు.

వివిధ యూనియన్ల నుంచి సిఐటియు లో చేరికలు:
జి రాజు, జి నర్సింహులు,బి నర్సింహులు, కె కుమార్,యస్ కె అబ్జల్ తదితరులు వివిధ యూనియన్ల నుండి సీఐటీయూలో చేరడం చేరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం,జిల్లా సహాయ కార్యదర్శి సుబ్బూరు సత్యనారాయణ ,ప్రీమియర్ యూనియన్ నాయకులు పుప్పాల గణేష్ తదితరులు పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *