యూరియా మీద అసత్య ప్రచారాలు-రేవూరి యూరియా మీద అసత్య ప్రచారాలు-రేవూరి

కొందరు రాజకీయ లబ్ది కోసం యూరియా మీద అసత్య ప్రచారాలు-రేవూరి

తెలుగు గళం న్యూస్, పరకాల, సెప్టెంబర్ 21

పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంనందు వ్యవసాయ శాఖ అధికారులతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…పరకాల నియోజకవర్గంలోని రైతులకు యూరియా కొరత తలెత్తకుండా చూడాలని, రైతులకు అవసరమైన యూరియా ఎరువు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మండలాల వారీగా డిమాండ్ కు అనుగుణంగా సరఫరా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు.
టోకెన్ పద్ధతిలో స్టాక్ ను బట్టి రైతులకు యూరియా బస్తాలు అందించాలని అన్నారు.ఇప్పటికే మనకు రావాల్సిన కోట వచ్చిందని, రైతులకు అవసరమైన యూరియా సకాలంలో పంపిణీ చేయాలని అన్నారు.కొందరు నాయకులు రాజకీయ లబ్దికోసం యూరియా పై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *