భూపాలపల్లి అభివృద్ది రమణారెడ్డి ఘనతభూపాలపల్లి అభివృద్ది రమణారెడ్డి ఘనత

భూపాలపల్లి నియోజక వర్గాన్ని అభివృద్ది చేసిన ఘనత గండ్ర వెంకటరమణారెడ్డి ది అని మాజీ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు హింగె మహేందర్ విమర్శించారు.రేగొండ మండల కేంద్రంలో బుదవారం బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు కోలేపాక భిక్షపతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హింగే మహేందర్ మాట్లాడుతూ బుగులోని జాతర లో ఆలయానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిధులు మంజూరు చేయగా అటవీ అనుమతులు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదన్నారు.జిల్లా కేంద్రంలో ఆసుపత్రి నిర్మించి చికిత్స కోసం వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా సొంత ఖర్చుతో ఉచిత భోజనం సమకూర్చిన గొప్ప మనసు కలిగిన రమణారెడ్డి ని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు.మా నాయకుడు మాకు సంస్కారం నేర్పించారు కాబట్టి మీలాగా ఏకవచనం తో సంబోదించ లేకపోతున్నామని అన్నారు.మేము ప్రభుత్వం మరచిన హామీలను సహేతుకంగా విమర్శిస్తూ,స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని అన్నారు. రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని గండ్ర వెంకట రమణారెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాపిరెడ్డి, బీఆర్ఎస్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు ఏనుగు లింగారెడ్డి,నాయకులు పసుల రత్నాకర్,తడక శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *