ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలిప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్న కలెక్టర్, ప్రజల నుండి స్వయంగా వినతిపత్రాలను స్వీకరించారు. ప్రజలు వివిధ సమస్యలను వివరిస్తూ సమాధానమివ్వాలని కోరగా, కలెక్టర్ ఓపిగ్గా విన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి అర్జీని సమయానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ప్రతి శాఖ సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 158 అర్జీలు స్వీకరించగా, వీటిలో రెవెన్యూ, హౌసింగ్ మరియు ఇతర విభాగాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, డి.ఆర్.డి.ఓ మేన శ్రీను, ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, సిపిఓ సత్యనారాయణరెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *