మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్

గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదు.

మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్

మహబూబాబాద్ జిల్లా తెలుగు గళం.

మరిపెడ మండలంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలిచే దిశగా నాయకులు కార్యకర్తలు సమన్వయంగా చేసుకొని పార్టీ అభ్యర్థులు గెలిపించే విధంగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని నవీన్ రావు గెస్ట్ హౌస్ కార్యాలయంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులతో గత రెండు సంవత్సరాలుగా గ్రామాలలో జరిగిన అభివృద్ధి శూన్యం తప్ప మరొకటి లేదు,నియోజకవర్గంలో నేను శాసనసభ్యునిగా చేసిన అభివృద్ధి మాత్రమే కనబడుతుంది.కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటినుండి గ్రామాలలో అభివృద్ధి నిలిచిపోయింది అన్నారు, గ్రామాల అభివృద్ధికి కావలిసిన మౌలిక వసతులను,రోడ్లు,విద్య,వైద్యం,సాగు,తాగునీటి,వసతులను సంపూర్ణంగా అందుబాటులోకి తీసుకు రాలేకపోయారు బలమైన ప్రతిపక్షంగా ప్రజలకోసం నిత్యం పనిచేస్తున్నా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు తప్పకుండా ఆదరించి గెలిపిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. కావున మండల ప్రజలు గమనించి జాగ్రత్తగా ఓటువేయాలి.
ఎన్నికల్లో నాయకులు సమన్వయంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకోవాలి అన్నారు,ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయం సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మాజీ ఒడిసియంస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, గాదె అశోక్ రెడ్డి,మాణిక్యం,రాంబాబు,రవీందర్,తాళ్లపెల్లి శ్రీనివాస్,గడ్డం వెంకన్న, శాస్త్రి, ప్రవీణ్ రెడ్డి, తాళ్లపెల్లి రఘు, రాంపెల్లి రవి గౌడ్, అజ్మీరా రెడ్డి,శ్రీనివాస రావు, గండి మహేష్, కాలు నాయక్, కొమ్ము చెంద్రశేఖర్, పార్టీ నాయకులు,మాజీ ఎంపిటిసిలు,సర్పంచ్ లు,గ్రామ పార్టీ అధ్యక్షులు,అన్ని గ్రామాల పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *