రేగొండ మండల కేంద్రానికి చెందిన సీనియర్ నాయకులు, తెలంగాణ రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి బుచ్చిరెడ్డి తల్లి ఈరోజు ఉదయం అనారోగ్యంతో పరమదించారు.ఈ వార్తతో మండల కేంద్రంలో విషాద వాతావరణం నెలకొంది.మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాజకీయ, సామాజిక సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి మృతురాలి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ దుఃఖ సమయంలో కుటుంబానికి ధైర్యం చెప్పి, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇటువంటి నష్టం తీరనిదని పేర్కొంటూ, కుటుంబం ఈ కష్టకాలాన్ని అధిగమించేలా భగవంతుడు శక్తినివ్వాలని ఆకాంక్షించారు.అతని వెంట పలువురు పార్టీ నాయకులు, యువజన నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు కూడా తమ సానుభూతిని తెలియజేస్తూ, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అదేవిధంగా,రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జయపాల్ రెడ్డి, రాష్ట్రా ఉపాధ్యక్షులు మాడుగుల పాపిరెడ్డి,జిల్లా నాయకత్వం బిల్లా రాజిరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల సుమన్ రెడ్డి,మూలగుండ్ల విజేందర్రెడ్డి, గోగుల చంద్రకర్ రెడ్డి, గన్ రెడ్డి మనోహర్ రెడ్డి,గుటం లింగారెడ్డి,కొంకాల వెంకటరెడ్డి కూడా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించింది.సంఘం తరఫున నాయకులు మాట్లాడుతూ, సంఘ కార్యకర్త కుటుంబానికి ఇంతటి విషాదం కలగడం బాధాకరమని పేర్కొన్నారు.మృతురాలి సేవలు, కుటుంబ విలువలను గుర్తు చేస్తూ, కుటుంబ సభ్యులు ఈ దుఃఖాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని తెలిపారు.

రెడ్డి సంక్షేమ సంఘానికి చెందిన యువజన విభాగం నాయకులు, జిల్లా స్థాయి ప్రతినిధులు, స్థానిక సంఘ సభ్యులు కలిసి మృతురాలికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, అవసరమైన అన్ని సందర్భాల్లో సంఘం తరఫున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో రేగొండ మండల కేంద్రంలో సంతాప వాతావరణం నెలకొంది. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *