కలెక్టరేట్ లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతికలెక్టరేట్ లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు,సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు.సావిత్రిబాయి పూలే జయంతి ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించి విద్యా బోధనలో ఉత్తమ పనితీరు కనబరిచిన మహిళా ఉపాధ్యాయినులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా శాలువాలతో సత్కరించి ప్రశంస పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే సేవలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో వైవి గణేష్,డీఈవో గిరిరాజ్ గౌడ్,బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి,విద్యాశాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *