జర్నలిస్టు కుటుంబానికి టీడబ్ల్యూజేఎఫ్ మద్దతుజర్నలిస్టు కుటుంబానికి టీడబ్ల్యూజేఎఫ్ మద్దతు

రోడ్డు ప్రమాదంలో గాయపడిన టిబీజేఏ అధ్యక్షుడి కుమారుడు

పరామర్శించిన రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నాగోల్ రాక్‌టౌన్ కాలనీలోని పవన్ సాయి ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), టీబీజేఏ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సామ్రాట్ గుప్తా కుమారుడు హర్షిత్ తేజను ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య గురువారం పరామర్శించారు.సిద్ధిపేట జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న హర్షిత్ తేజ తన మామయ్యతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతనికి కుడికాలు, కుడిచేయి విరిగాయి. ప్రస్తుతం పవన్ సాయి ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతనికి నేడు శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు వైద్యుడు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా మామిడి సోమయ్య హర్షిత్ తేజ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, సామ్రాట్ గుప్తా కుటుంబానికి ధైర్యం చెప్పారు. అలాగే వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయం అందజేసి, టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టు కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *