ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకుని కాంగ్రెస్ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకుని కాంగ్రెస్

తెలుగు గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్

జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు,ఘనపూర్ గ్రామ 6, 7, 8, 9, 10, 11 వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె వాడవాడకు, ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకుని కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం అవసరమని ఆమె పేర్కొన్నారు. గత సంవత్సరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ మంజూరు చేయించుకోవడంతో పాటు అభివృద్ధి కోసం రూ.50 కోట్ల నిధులు సాధించారని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ప్రత్యేక దృష్టి ఉందని అన్నారు.ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.గత పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధిలో విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు లోనుకాకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.తమ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.గ్రామాలు, వార్డుల పరిస్థితిని పరిశీలిస్తే డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, సీసీ రోడ్లు లేకపోవడం వంటి అనేక మౌలిక వసతుల కొరత స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా చర్చించి, ఇతర ఎమ్మెల్యేలు సాధించలేని నిధులను తీసుకువచ్చి స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎంపీ కడియం కావ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు 6వ వార్డు అభ్యర్థి కనకం రమేష్,7వ వార్డు అన్నెపు సుమలత కుమార్,8 వ వార్డు చాతరబోయిన సత్యనారాయణ 9వ వార్డు సౌదరపల్లి సంపత్ రాజ్,10వ వార్డు తోకల అనుష రాజు,11వ వార్డు నీల రాజమ్మ గట్టయ్య ఇన్చార్జులు పార్టీ నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *