21 వ వార్డ్ లో మందపాటి ప్రభాకర్ రెడ్డి విస్తృతప్రచారం21 వ వార్డ్ లో మందపాటి ప్రభాకర్ రెడ్డి విస్తృతప్రచారం

ఖమ్మంజిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 21వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందపాటి ప్రభాకర్ రెడ్డి గడప గడపకు విస్తృతప్రచారం నిర్వహిస్తున్నారు.వార్డులోని ప్రతి వీధి, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు. 21 వ వార్డ్ గెలుపు దిశగా రాజకీయ రంగంలో , ప్రజాసేవా కార్యక్రమాలలో దీటైన మాటలతో , మాటలే కాదు చేతలతో వార్డు ప్రజలకి ఆదరణగా ఉంటూ ఈ ప్రయాణం అంచలంచెలుగా సాగుతోందనీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను తెలుసుకుంటూ, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు. ప్రజల ఆశీస్సులు, మద్దతుతో 21 వ వార్డును మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొంటూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు హస్తంపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కరోనా సమయంలో ఆర్ధిక సహాయం, ఆసుపత్రుల్లో వైద్యం అందించి పలువురికి అండగా నిలిచిన అనుభవాన్ని గుర్తు చేస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు , వార్డు సమస్యలపై పూర్తి అవగాహన తమ బలమని తెలిపారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *