రేగొండలో ఘోర రోడ్డు ప్రమాదం–లారీ డ్రైవర్ మృతిరేగొండలో ఘోర రోడ్డు ప్రమాదం–లారీ డ్రైవర్ మృతి

భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని లారీ డ్రైవర్ మృతి చెందిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసుల వివరాల ప్రకారం… యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కోతులపురం గ్రామానికి చెందిన నరేష్ (25) లారీ డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు.ఈ నెల 11వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇసుక లోడింగ్ కోసం హైదరాబాద్ నుంచి మహాదేవపూర్ వైపు లారీ నంబర్ టిఎస్ 07 యూకె 3519 లో బయలుదేరాడు.12వ తేదీ తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ హెచ్-353C జాతీయ రహదారిపై సబ్‌స్టేషన్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ నంబర్ టిజి 07 డబ్లూ 1868 ను అతివేగంగా,అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ నరేష్ లారీని ఢీకొట్టినట్లు సమాచారం. ఢీకొన్న ప్రభావంతో నరేష్ లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు.ఈ ప్రమాదంలో నరేష్‌కు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, కుడి కాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. తల వెనుక భాగంలో గంభీర గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానికుల సహాయంతో వెంటనే 108 అంబులెన్స్ ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. అయితే హైదరాబాద్‌కు తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో ఉదయం సుమారు 10:38 గంటలకు నరేష్ మృతి చెందినాడు.ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ దేవేందర్ రెడ్డి (గ్రామం సిరసపల్లి, హుజురాబాద్ మండలం)గా పోలీసులు గుర్తించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు రేగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదం నెలకొంది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *