కాంగ్రెస్ విప్‌గా సౌదరపల్లి సంపత్ రాజ్ నియామకం

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విప్‌గా 9వ వార్డు కౌన్సిలర్ సౌదరపల్లి సంపత్ రాజ్‌ను ప్రకటించారు. ఈ మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారికంగా నియామకాన్ని ప్రకటించారు.హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన కార్యక్రమంలో సంపత్ రాజ్‌కు విప్ నియామక పత్రాన్ని అందజేశారు.మున్సిపాలిటీలో పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.స్టేషన్ ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షుడు జులుకుంట్ల శిరీష్ రెడ్డి తదితరులు హాజరై సంపత్ రాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *