సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిసేవాలాల్ మహారాజ్ 287వ జయంతి

మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు మహబూబాబాద్ పట్టణంలోని బాబు నాయక్ తండాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి భూక్య హరి నాయక్‌ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గిరిజనుల ఆత్మగౌరవం, ఐక్యతకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. అలాగే గిరిజనుల సంక్షేమం, హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బానోత్ వెంకన్న నాయక్, పాటు సంఘం నాయకులు భూక్య కళ్యాణ్ నాయక్, బానోత్ బుజ్జి, రవి నాయక్, పార్వతి పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *