మహిళాభివృద్ది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యంమహిళాభివృద్ది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

సత్తుపల్లి మున్సిపాలిటీ ఏర్పడి నాటి నుంచి ఇప్పటికీ వరకు మైనారిటీ వర్గానికి సముచితమైన స్థానం ఎవరు కల్పించలేదు.
గత పదేళ్ల పాలనలో మరియు బీఆర్ఎస్ కూడా అవకాశం ఇవ్వలేదు.
అధికారం వచ్చిన వెంటనే తమ శైలిని మారిపోతున్న ఈ కాలపు నేతలలా కాకుండా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ తమ వెంట అన్ని కష్టకాలంలో నిలబడిన ఎండీ కమల్ పాషా దంపతులను గుర్తు పెట్టుకొని ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సత్తుపల్లి మున్సిపల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మహిళలకు అవకాశం కల్పించారు.ఇక్కడ ఒక విషయం గమనించాలి.
మొట్టమొదటి సారిగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే , మున్సిపల్ చైర్మైన్ మరియు వైస్ చైర్మన్ లు పదవులలో మహిళలు ఉండడం గమనార్హం.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *