మృతుని కుటుంబానికి ఆర్థిక చేయూతమృతుని కుటుంబానికి ఆర్థిక చేయూత

భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రానికి చెందిన రైతు కొంకాల మీనారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన నేపథ్యంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు,స్థానిక మాజీ సర్పంచ్ మోడెం ఉమేష్ గౌడ్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఉమేష్ గౌడ్ మాట్లాడుతూ, రైతు మీనారెడ్డి మరణం బాధాకరమని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం తమ వంతు సహాయంగా రూ.2000 ఆర్థిక చేయూతను కుటుంబానికి అందజేశారు.ఇలాంటి క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గండి తిరుపతి గౌడ్, రూపురెడ్డి లింగారెడ్డి, గోగుల అశోక్ రెడ్డి, గుర్రాల రాజిరెడ్డి, కట్ల రాజిరెడ్డి, కట్ల చంద్రారెడ్డి, గుర్రాల వెంకటరెడ్డి, పద్మశాలి సంఘం అధ్యక్షులు మాచర్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *