పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కౌటం రవి పటేల్పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కౌటం రవి పటేల్

జిల్లాలో వివిధ సామాజిక,కుటుంబ, పార్టీ కార్యక్రమాల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు.మొదటగా బాగిర్తిపేట ఎక్స్ రోడ్ వద్ద జరిగిన దూకుండపల్లి సుమన్–ఆరాధ్య వివాహ శుభకార్యానికి హాజరైన రవి పటేల్ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం చిట్యాల మండలంలో టీఆర్పీ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ లక్ష్మణ్ ప్రసాద్ నిర్వహించిన స్పూర్తి రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని వధూవరులకు శుభాభినందనలు తెలియజేశారు.తదుపరి కాకర్లపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన సూర వెంకటమ్మ కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పి పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.అలాగే చల్పూర్–లక్కుంట్ల ప్రాంతానికి చెందిన టీఆర్పీ నాయకుడు రజనీకాంత్ న్యూరో సమస్యతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన వెల్డింగ్ వర్క్ షాప్‌ను సందర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.ఇక బాగిర్తిపేట గ్రామంలో పలువురు స్థానికులు టీఆర్పీ పార్టీలో చేరగా,వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన లక్ష్యమని, సామాజిక న్యాయం సాధనకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజలతో నిరంతరం మమేకమై సేవ చేయడం ద్వారా జిల్లా అభివృద్ధికి కృషి కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *