నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారాకఠినంగా శిక్షించాలినిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారాకఠినంగా శిక్షించాలి

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో అగ్రకులాల వారు రజక కుటుంబ దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకునే సందర్భంగా జరిగిన దాడిలో రెండు నెలల పసిపాపను తన్ని చంపేశారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక నెహ్రు సెంటర్ లో ఆ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.కుల అహంకారం తో పసిబిడ్డను హత్య చేసిన సర్పంచ్ తో పాటు నిందితులందరిపై కేసు నమోదు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా విచారణ జరిపి దొషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో బాదితులకు అన్ని రకాలుగా న్యాయం చేసి ఆడుకోవాలని డిమాండ్ చేసారు. ఈ రాస్తా రో కోలో సిపిఎం మండల నాయకులు ఇమ్మడి గోవింద్,జి. వీరభద్రం,ఎస్. కె బాజీ,వార్డు సభ్యులు సాయి, పూర్ణ చందర్, కార్యకర్తలు కోటయ్య,ఆర్. సాయిరాం, రమేష్, రాంబాబు, వెంకటేష్, తదితరులు ఉన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *