కోటంచ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించిన నిషిధర్ రెడ్డికోటంచ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించిన నిషిధర్ రెడ్డి

రేగొండ మండలం పరిధిలోని ప్రసిద్ధ కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంను ఏడునూతుల నిశిధర్ రెడ్డి సందర్శించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై ఆయన ఆలయ నిర్వాహకులతో చర్చించారు.ఇదే వేడుకలో ఆలయ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సంపత్ రావును శాలువాతో ఘనంగా సన్మానించారు.ఆలయ నిర్వహణను పారదర్శకంగా,భక్తులకు అనుకూలంగా కొనసాగిస్తూ ఆలయ వైభవాన్ని మరింత పెంచాలని నిశిధర్ రెడ్డి ఆకాంక్షించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా తాగునీరు, దర్శన ఏర్పాట్లు, శుభ్రత వంటి అంశాలను బలోపేతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో దాసరి తిరుపతి రెడ్డి, లింగపల్లి ప్రసారావు, పెండల రాజు, ఎర్రబాటి శివకృష్ణ, బీజేవైఎం జిల్లా నాయకులు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం భక్తి వాతావరణంలో నిర్వహించబడగా, స్థానిక భక్తులు, నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *