గార్ల రైల్వే స్టేషన్ లో శాతవాహన హాల్టింగ్గార్ల రైల్వే స్టేషన్ లో శాతవాహన హాల్టింగ్

ఉదయం పూట ప్యాసింజర్ పునరుద్ధరణ,

రాంపురం శివారులో రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని,

పలు మౌలిక సదుపాయాలు కల్పించాలని,
DRM కు
గార్ల మండల అఖిలపక్షం, యువకుల తరపున వినతి పత్రం. గార్ల మండలంలో గార్ల రైల్వే స్టేషన్ నందు శాతవాహన ఎక్స్ప్రెస్ హాల్టింగ్ తో పాటు ఉదయం పూట విజయవాడ వెళ్ళు ప్యాసింజర్ రైలు పునరుద్దరణ, మరియు గార్ల రైల్వే స్టేషన్ నందు డిస్ప్లే ఏర్పాటు చేయాలనీ, అధిక రెవెన్యూ కలిగిన గార్ల రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయాలని, మూడో లైన్ నాలుగో లైన్ పడుతున్న దృష్ట్యా, రాంపురం తదితర శివారూ గ్రామాలకు రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం చేసి రహదారి సౌకర్యం కల్పించాలని, పలు మౌలిక సదుపాయాలు కల్పించాలని, గార్ల మండలం అఖిలపక్షం మరియు యువకుల తరఫున వినతి పత్రం డిఆర్ఎంకు గార్ల రైల్వే స్టేషన్ నందు సమర్పించడమైనది. మరియు గార్ల రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఇబ్బందిగా ఉన్న రహదారి సౌకర్యం కల్పించినందుకు డిఆర్ఎమ్ కు మరియు సంబంధిత రైల్వే అధికారులకు గార్ల మండలం ప్రజల ప్రయాణికుల తరఫున అభినందనలు తెలపడం జరిగింది.
డిఆర్ఎం మరియు పలు రైల్వే సంబంధిత అధికారులు సానుకూలంగా గార్ల రైల్వే స్టేషన్ సమస్యలపై స్పందించడం జరిగినది. వీలున్నంతవరకు త్వరలో మౌలిక సదుపా యాలు కల్పించేటట్లుగా సంబంధిత రైల్వే అధికారులు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కందునూరి ఈశ్వర్ లింగం, పానుగంటి రాధాకృష్ణ, రైల్వే డి ఆర్ సి యు కమిటీ సభ్యులు జరుపుల లచ్చిరాం నాయక్, ఖాదర్ బాబా, గార్ల మండల పలు రాజకీయ నాయకులు యువకులు శివాజీ, రమేష్, కోల కుమార్, బొంబాయి పాషా, బాబు, వెంకన్న, ప్రభాకర్, నాగరాజు, అనిల్, రామారావు, బబ్లు, హరి, రంగారావు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *