నూతన ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలి నూతన ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలి

గార్ల మండలం ముత్తి తండా గ్రామంలో చాలా రోజుల క్రితం సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫారం కాలిపోయింది. దాని స్థానంలో నూతన ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలని అదే విధంగా డ్యామేజ్ ఉన్న పోల్స్ స్థానంలో నూతన పోల్స్ ఏర్పాటు చేయాలని మరియు వ్యవసాయం సంబంధించిన త్రీఫేస్ విద్యుత్తు వైర్లు ముత్తి తండా గ్రామ పార్కు నుండి ట్రాన్స్ఫారం వరకు ప్రమాదకరంగా కిందకు వేలాడి ఉన్నాయి.వాటిని కూడా మిడిల్ పోల్స్ ఏర్పాటు చేయాలని గతంలో సి.జి.ఆర్.ఎఫ్ కు పిర్యాదు చేశామని కానీ ఇప్పటివరకు సమస్యను పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని వెంటనే సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తామని అన్నారు. ఈరోజు తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గార్ల ఏఈ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య హరినాయక్ నాయకులు రూన్వాల్ వీరన్న,రాజేష్ కిషన్ తదితరులు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *