వేసవి తీవ్రత దృష్ట్యా విద్యుత్ స్తంభాలను ఏర్పాటువేసవి తీవ్రత దృష్ట్యా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు

రానున్న వేసవి తీవ్రత దృష్ట్యా ముందుగానే ఎటువంటి లో వోల్టేజ్ సమస్యలు లేకుండా నిరంతరాయంగా డివిజన్ ప్రజలకు విద్యుత్తును అందించే ప్రయత్నంలో భాగంగా డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు డివిజన్ పరిధిలోని పలు వీధులలో సంబంధిత ప్రభుత్వ శాఖ సమన్వయంతో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా స్థానిక బైపాస్ రోడ్, ఎంబి.గార్డెన్ జంక్షన్ వద్ద సరి అయిన వెలుతురు లేక అనేక వాహనదారులు పడుతున్న ఇబ్బందీని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతంలో కూడా అధికారాలకు చెప్పి విద్యుత్ స్తంభాన్ని, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తోట గోవిందమ్మ రామరావు తెలియజేస్తూ డివిజన్ ప్రజలకు విద్యుత్ పరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పూర్తిస్థాయిలో పరిష్కరించే దిశగా ముందుంటామని ఈ విషయంలో ప్రజలు కూడా మాతో సహకరించాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ BRS నాయకులు వంగాల వెంకట్, చేతి కృష్ణ, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *