శ్రీ రుక్మిణి దేవి సత్యభామ పాండురంగనాథస్వామి కళ్యాణోత్సవం శ్రీ రుక్మిణి దేవి సత్యభామ పాండురంగనాథస్వామి కళ్యాణోత్సవం

తెలుగు గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్,మే 27

స్టేషన్ ఘనపూర్ మండలం పాంనూర్ గ్రామంలో శ్రీ రుక్మిణి దేవి సత్యభామ పాండురంగనాథస్వామి కళ్యాణోత్సవం జరిగింది.మూడు రోజుల నుండి ఉత్సవాలు జరుగుతున్నాయి. 25వ తేదిన రాత్రి 8 గంటలకు తోళ్ళక్కం ప్రారంభించారు.26వ తేది దశమి నాడు ఉదయం 9 గంటలకు ప్రభంద సేవాకాలం, తీర్థప్రసాద గోష్ఠి జరిగింది.27వ తేదిన ఏకాదశి ఉదయం 9 గంటలకు ఉత్సవ మూర్తుల ఎదురుకోళ్ళు,మధ్యాహ్నం 12 గంటలకు రుక్మిణి సత్యభామ పాండురంగనాథస్వామి వారి కళ్యాణోత్సవం జరిగింది.సాయంత్రం 6 గంటలకు గ్రామ వీధుల్లో ఉత్సవ మూర్తులకు ముత్యాల పల్లకిలో ఊరేగింపు జరిగింది.ఈ కళ్యాణ వేడుకలు పురోహితులు ఆరుట్ల సింగాచార్యులు,శేషాచార్యుల చేతుల మీదుగా
అంగరంగ వైభవంగా జరిగాయి.శ్రీ పాండురంగనాథస్వామి
ఆలయ చైర్మన్ బత్తిని రవి, వైస్ చైర్మన్ సముద్రాల సారంగం,ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి బుచ్చయ్య,కార్యదర్శి గట్టు బాబు,కోశాధికారి గట్టు యాదగిరి ఆద్వర్యంలో కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి.శ్రీ పాండురంగనాథస్వామి రుక్మిణి సత్యభామ కళ్యాణానికి పట్టు వస్త్రాలు , పుస్తెమట్టెలు భక్తులు అందజేశారు.అంగరంగ వైభవంగా జరిగిన ఈ కళ్యాణ వేడుకలలో చిన్నారులు నృత్యంతో భక్తులను అలరించారు.శ్రీ రుక్మిణి సత్యభామ పాండురంగనాథస్వామి కళ్యాణాన్ని చూడడానికి వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.కళ్యాణ వేడుకల అనంతరం వెంకటకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారులు అన్నదానం చేశారు.ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామ సర్పంచ్ పోలెపల్లి సంపత్ రెడ్డి,ఉప సర్పంచ్ తాళ్ళపల్లి జయ శివకుమార్, వివిధ మండలాల ప్రజలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *