బీసీ డిమాండ్స్ పై ప్రధానమంత్రి ప్రకటన చేయాలిబీసీ డిమాండ్స్ పై ప్రధానమంత్రి ప్రకటన చేయాలి

ఇప్పటివరకు బీసీల కోసం చేసింది ఏమీ లేదు

•బీసీలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు

బీసీ హక్కులసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాములు వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఆదివారం బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి బీసీల కోసం చేసిందేమీ లేదని హైదరాబాద్ సభలోనైనా బీసీల డిమాండ్స్ పై స్పష్టమైన ప్రకటన చేయాలని లేనిచో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రధానికి బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. దేశంలో ఎనభై కోట్లకు పైగా ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ,దేశ జన గణనలో కుల గణన చేస్తామని హామీ ఇచ్చి కుటుంబాల లెక్కించడంలో బీసీల కుటుంబాలను ఎందుకు లెక్కించడం లేదన్నారు? తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 % రిజర్వేషన్ కల్పిస్తూ మీకు పంపిస్తే ఇంకెంత కాలం పెండింగ్లో ఉంచి దగా చేస్తారని ప్రశ్నించారు. మూడు శాతం కూడా లేని అగ్రవర్ణాల పేదల కోసమని 10 శాతం ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు కల్పించిన, బీసీనని చెప్పుకునే మీరు బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు పెంచడం లేదని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ పై మొసలి కన్నీరు కార్చే మీరు మహిళా రిజర్వేషన్ల లో బీసీ మహిళా కోటా పెట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.కేంద్ర బడ్జెట్లో జనాభా ప్రాతిపదికన ఓబీసీ లకు నిధులు కేటాయించకుండ ఇంకెంతకాలం దగా చేస్తారని ప్రశ్నించారు.సామాజిక రిజర్వేషన్లపై పెట్టిన 50% రిజర్వేషన్లు ఎందుకు తగ్గించడం లేదో చెప్పాలన్నారు. ఇప్పటికైనా మోడీ బీసీ డిమాండ్స్ పై స్పందించాలని బీసీలకు చట్టసభలలో 50%రిజర్వేషన్ తో పాటు దేశ జనగణనలో బీసీ కులగణన ఇతర బీసీ డిమాండ్స్ పై హైదరాబాద్ సభలో స్పష్టంగా ప్రకటించాలని వెంకట్రాములు డిమాండ్ చేశారు. బీసీల ఎడల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దేశవ్యాప్తంగా చైతన్యవంతులైన బీసీలు సంఘటితమై డిమాండ్స్ సాధించేవరకు సమరశీల పోరాటాలు నిర్వహిస్తారని హెచ్చరించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *