చదువుతోనే పేదవాడు ధనవంతుడు కాగలడుచదువుతోనే పేదవాడు ధనవంతుడు కాగలడు

క్రమశిక్షణ, విలువలతో కూడిన చదువుతో పేదవారు సైతం ధనవంతులు కాగలరని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు.
తెలంగాణ పాలీసెట్–2026 ప్రవేశ పరీక్షలో 120/120 మార్కులతో రాష్ట్ర ప్రథమ స్థానం (State 1st Rank) సాధించిన విశ్వశాంతి స్కూల్ (సత్తుపల్లి) విద్యార్థి మహ్మద్ మహబూబ్ అర్ఫాజ్ అలీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు సోమవారం ఘనంగా సత్కరించారు.
అతని వున్నత చదువుకు సహకరిస్తానని భరోసా ఇచ్చారు.
శాలువా, పుష్పగుచ్ఛంతో అభినందించారు. సత్తుపల్లి ప్రాంతం నుంచి తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు రావడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు.మంత్రి తుమ్మల మాట్లాడుతూ, చదువు మనిషి జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తివంతమైన సాధనమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో ఉన్నత విద్యలో రాణించి సత్తుపల్లి ఖ్యాతిని మరింత పెంచాలని అర్ఫాజ్‌కు సూచించారు.
ఈ కార్యక్రమంలో విశ్వశాంతి స్కూల్ యాజమాన్యం పసుపులేటి నాగేశ్వరరావు, నరుకుళ్ల సత్యనారాయణ, విద్యార్థి తండ్రి అఫ్జల్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులను తుమ్మల అభినందించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *