తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

తెలుగు గళం న్యూస్, ఖమ్మం పట్టణం / జూన్ 03, ఖమ్మం జిల్లా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కిషన్ నాయక్, ఖమ్మం జిల్లా ఇన్చార్జి గట్టు కరుణ మాట్లాడుతూ, నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు తీరిన రోజు జూన్ 2 అని, సామాజిక తెలంగాణ అంశంగా మరోసారి ఉద్యమం చేయవలసిన అవసరం ఉన్నదని గుర్తు చేశారు. నీళ్లు నిధులు, నియామకాల పేరుతో ఆనాడు రాష్ట్రంలో ఉండబడినటువంటి సకల జనం వర్గాల ప్రజలు నిలబడి కలబడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పూర్తిస్థాయిలో ఆకాంక్షలను నెరవేర్చుకోలేకపోయిందని అన్నారు. ఆనాడు మలిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలని తునప్రాయంగా, రాష్ట్ర సాధన కోసం అర్పిస్తే, ఆ కుటుంబాలకు ఆదుకున్న పాపాన గత పాలకులు పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలన పేరుతోనే రేవంత్ రెడ్డి సర్కారు మేనిఫెస్టోలో పెట్టి అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ ఇస్తామని తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇస్తాము ఇంటి నిర్మాణం కోసం అని, అనేక వాగ్దానాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత 420 హామీలను విస్మరించాలని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో షేక్ నవాజ్, సతీష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *