నేటి తరం పిల్లలతో ' ' 'గోళీల ఆట'ఆడిన మాజీ వైస్ ఎంపిపి ఎర్రబెల్లి రాజేశ్వర్ రావునేటి తరం పిల్లలతో ' ' 'గోళీల ఆట'ఆడిన మాజీ వైస్ ఎంపిపి ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు

శతాబ్దాల నాటి మన పురాతన గ్రామీణ క్రీడ ‘గోళీల ఆట’ మళ్లీ ప్రాణం

నేటి తరం పిల్లలతో ‘ ‘ ‘గోళీల ఆట’ఆడిన మాజీ వైస్ ఎంపిపి ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు

తెలుగు గళం న్యూస్, పర్వతగిరి (కల్లెడ) / జూన్ 14 :

ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్ గేమ్‌లు, ఆన్‌లైన్ ఆటల జోరు పెరిగిపోయిన ఈ రోజుల్లో, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో శతాబ్దాల నాటి మన పురాతన గ్రామీణ క్రీడ ‘గోళీల ఆట’ మళ్లీ ప్రాణం పోసుకుంది.ఆదివారం నాడు గ్రామ పరిసరాల్లోని యువ నాయకులు మాజీ వైస్ ఎంపిపి ఎర్రబెల్లి రాజేశ్వరరావు స్వస్థలంలో స్థానిక యువకులు, బాలురు కలిసి ఎంతో ఉత్సాహంగా గోళీల ఆట ఆడుతూ కనిపించారు.
మాయమవుతున్న పాత జ్ఞాపకాలు ఒకప్పుడు పల్లెల్లో ప్రతి వీధిలోనూ పిల్లలు ఎంతో ఇష్టంగా ఆడే ఈ ఆటలు నేటి డిజిటల్ యుగంలో పూర్తిగా కనుమరుగవుతున్నాయి.నేటి తరం పిల్లలకు ఈ ఆటల గురించి కనీస అవగాహన కూడా లేకుండా పోతోంది.ఇలాంటి తరుణంలో కల్లెడ గ్రామ యువకులు నేలపైన గుంతలు తీసి, సాంప్రదాయ పద్ధతిలో గోళీలను గురిచూసి కొడుతూ పాత రోజులను గుర్తుచేసుకున్నారు.
శారీరక, మానసిక వికాసానికి తోడ్పడే ఆటలు
ఈ సందర్భంగా ఆటలో పాల్గొన్న యువకులు మాట్లాడుతూ.. “స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలై సమయాన్ని వృథా చేసుకునే కంటే,ఇలాంటి సాంప్రదాయ ఆటలు ఆడటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.స్నేహితుల మధ్య ఆత్మీయత పెంపొందడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది” అని తెలిపారు.
గ్రామంలో యువకులు ఇలా ఉత్సాహంగా పురాతన ఆటలు ఆడటం చూసి పెద్దలు సైతం తమ చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుని ఆనందం వ్యక్తం చేశారు.మన సంస్కృతిని,గ్రామీణ క్రీడలను కాపాడుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు ఎంతో అవసరమని గ్రామస్థులు కొనియాడారు.ఈ ఆటలో ముంజ శ్రావణ్ గౌడ్, ఎర్రబెల్లి శ్రేయాన్ రాజేశ్వరరావు రావు, హాంజద్ పాష,ముదురకోల రాజు,వడ్లకోండ రంజీత్,దోమ్మటి భరత్,ముంజాల అరవింద్,ముదురకోల శ్రీకాంత్, మధు, మల్లేష్ లతో పాటు తదితరులు ఉన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *